Former England spinner, Monty Panesar reckoned that England head coach Chris Silverwood was one of the men behind the heated altercations that took place during the Lord’s Test. And Monty Panesar Feels Virat Kohli Can’t Tolerate these things
#INDVSENG
#ViratKohli
#MontyPanesar
#Sledging
#JamesAnderson
#JaspritBumrah
ఆటగాళ్లను దూషించినా, వాళ్లతో దురుసుగా ప్రవర్తించినా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఊరుకోడని ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ అన్నాడు. తన ఆటగాళ్లను ఏమన్నా అంటే.. విరాట్ తగిన రీతిలో జవాబిస్తాడన్నాడు. లార్డ్స్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రాను లక్ష్యంగా చేసుకుని ఇంగ్లండ్ ఆటగాళ్లు నోటికి పని చెప్పిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఇంగ్లండ్ బ్యాటింగ్ సమయంలో టీమిండియా కెప్టెన్ కూడా ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌పై మాటల దాడికి దిగాడు. మొత్తానికి రెండో టెస్ట్ మాటల యుద్ధంతో ముగిసింది. ఇక భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య లీడ్స్‌లో ఈనెల 25 నుంచి మూడో టెస్ట్ ప్రారంభం కానుంది.